నాటిన వెంటనే నీరు పెట్టి, 4 రోజుల తర్వాత ప్రాణ తడి ఇవ్వాలి. తర్వాత మెట్ట భూముల్లో వారానికి ఒకసారి, మాగాణుల్లో 10–15 రోజులకు ఒకసారి; ప్రతి ఎరువు వేసిన తర్వాత సమృద్ధిగా నీరు పెట్టాలి. డ్రిప్‌తో: 4వ నెల వరకు మొక్కకు రోజుకు 15 లీటర్లు, 5వ నెల నుండి గెల వచ్చే వరకు 20 లీటర్లు, గెల వచ్చినప్పటి నుండి కోతకు 15 రోజుల ముందు వరకు 25 లీటర్లు.